ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeజాతీయంరామోజీరావు ఆస్తులు జప్తుచేసి బాధితులకు పంచె హక్కు మాకుంది!

రామోజీరావు ఆస్తులు జప్తుచేసి బాధితులకు పంచె హక్కు మాకుంది!

📰 Generate e-Paper Clip

• రామోజీ రావు చనిపోయినా అతని ఆస్తులు జప్తు చేసి బాధితులకు పంచవచ్చు

• మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విశాలజ్యోతి డెస్క్:  మార్గదర్శి  ఫైనాన్సియర్స్ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో రామోజీరావు చనిపోయాడని కేసు కొట్టేయాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్ తరపు న్యాయవాది కోరారు. రామోజీరావు చనిపోయినంత మాత్రాన సంస్థపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ తొలగిపోవని, అవసరమైతే ఆయన ఆస్తులు అన్ని జప్తు చేసి బాధితులకు పంచే హక్కు కూడా మాకుంది అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో బాధితులకు డబ్బు చెల్లింపులు పూర్తిచేశామని తెలిపిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ తరపు న్యాయవాది దీంతో ఈ వివాదంపై సమగ్ర వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ చైర్మన్ చెరుకూరి కిరణ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ, జూలై 15వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!