ePaper
Tuesday, September 1, 2026
ePaper
Homeతెలంగాణకేయూలో ప్రభుత్వ ఆస్తులు స్క్రాప్‌గా విక్రయం..?

కేయూలో ప్రభుత్వ ఆస్తులు స్క్రాప్‌గా విక్రయం..?

📰 Generate e-Paper Clip

• ఒకవైపు షోకాజ్ నోటీసులు….

• మరో వైపు స్క్రాప్ అమ్మకంలో అక్రమాలు..!

• హాస్టల్ సొమ్ము ఎవరికి చేరింది..?

• ఖాళీ నూనె డబ్బాల నుంచి ఇనుప సామాన్ల వరకు అమ్మకాలు…?

• రూ.17 వేల ఆదాయం ఎక్కడికి వెళ్లింది…?

• షోకాజ్ నోటీసులు ప్రభావం చూపలేదా…?

• గేట్ పాస్‌లు ఇచ్చింది ఎవరు…?

• అన్ని మెస్‌లలో ఇదే పరిస్థితినా…?

విశాలజ్యోతి: కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టళ్లలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక అక్రమాల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే హాస్టల్ నిధుల దుర్వినియోగం, అడ్వాన్సుల చెల్లింపులు, మెస్ బిల్లుల వ్యవహారాలపై మాజీ హాస్టల్ డైరెక్టర్‌ డా ఎల్.పీ. రాజ్ కుమార్ తో పాటు పలువురు జాయింట్ డైరెక్టర్లు, కేర్ టేకర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో, తాజాగా హాస్టల్ వస్తువులు విక్రయం అంశం కొత్త చర్చకు దారితీసింది. విద్యార్థుల అవసరాల కోసం కొనుగోలు చేసిన వస్తువులు, హాస్టల్‌కు చెందిన పాత సామగ్రి సరైన విధానాలు పాటించకుండా బయటకు తరలించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!