ePaper
Friday, July 17, 2026
ePaper
Homeలోకల్పాఠశాల ఉపాధ్యాయుని నుండి కళాశాల ప్రిన్సిపాల్ వరకు.....!

పాఠశాల ఉపాధ్యాయుని నుండి కళాశాల ప్రిన్సిపాల్ వరకు…..!

📰 Generate e-Paper Clip

• సంపత్ కుమార్ స్థానం ప్రత్యేకం.

• అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి: బాబురావు

• ఘనంగా నేడు పరకాలలో పదవీవిరమణ సభ

• హాజరైన పలువురు సంఘాలనేతలు, అధ్యాపకులు.

• ఆత్మీయంగా వీడ్కోలు పలికిన సంఘాలు, అధ్యాపకులు. 

విశాలజ్యోతి: హన్మకొండ జిల్లా లోని పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి నేడు పదవి విరమణ పొందుతున్న కె సంపత్ కుమార్ పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఆసోసియేషన్ మాజీ రాష్ట్ర నాయకులు వీరమళ్ల బాబురావు ,పలువురు ప్రిన్సిపాల్ లు అధ్యాపక సంఘాల భాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఆసోసియేషన్ మాజీ రాష్ట్ర నాయకులు వీరమళ్ల బాబురావు మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయునిగా కె. సంపత్ కుమార్ తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, జూనియర్ కాలేజి లెక్షరర్ గా, ప్రిన్సిపాల్ గా పనిచేసి అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన మంచి స్ఫూర్తి దాయకుడు, స్నేహశీలి, మృదు స్వభావి కె. సంపత్ కుమార్ అని అన్నారు. అనంతరం పలువురు ప్రిన్సిపాల్ లు మాట్లాడుతూ నేడు పదవి విరమణ పొందుతున్న కె సంపత్ కుమార్ సేవలను కొనియాడారు. తన భావి జీవితం అష్ట ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షుడు కందకట్ల కోటేష్, హన్మకొండ జి జె సి ప్రిన్సిపాల్ రెబ్బ శ్రీనివాసరావు, మాజీ ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, కళాశాల అధ్యాపకులు,ఆధాపకేతర సిబ్బంది, కుటుంబ సభ్యులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!