ePaper
Friday, July 17, 2026
ePaper
Homeజనగామపోలియోరహిత సమాజానికి సహకరించాలి: సర్పంచ్ కొండ ఊర్మిళ

పోలియోరహిత సమాజానికి సహకరించాలి: సర్పంచ్ కొండ ఊర్మిళ

📰 Generate e-Paper Clip

 

విశాలజ్యోతి:  జనగామ  జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ కొండ ఊర్మిళ, ఉపసర్పంచ్ జోగు అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు తమ చిన్నారులను పోలియో బూత్‌లకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ సభ్యులు, గ్రామ ప్రజలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!