ePaper
Friday, July 17, 2026
ePaper
Homeతెలంగాణధాన్యం తరలింపులో ఓవర్ లోడింగ్!

ధాన్యం తరలింపులో ఓవర్ లోడింగ్!

📰 Generate e-Paper Clip

  • నిబంధనలు పట్టించుకొని అధికారులు
  •  ఓవర్ లోడింగ్ నివారించాల్సిన అధికారులే ఓవర్ లోడ్ చేయిస్తున్నారు.
  • ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది…? 
  • వాహనాలు దెబ్బతింటాయని ట్రాక్టర్ యజమానుల ధర్నా.

విశాలజ్యోతి డెస్క్ : ( హుస్నాబాద్ రూరల్ ) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులు మంగళవారం మండలంలోని బంజేరుపల్లి శివారు ప్రాంతంలోని ఓ రైస్ మిల్లు వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించే ప్రక్రియలో భాగంగా ఓవర్ లోడింగ్ చేయిస్తున్నారని ట్రాక్టర్ యజమానులు ఆరోపించారు. ఒక ట్రాక్టర్‌కు మోతాదుకు మించి బస్తాలు ఎక్కించడం వల్ల వాహనాలు తరచూ దెబ్బతింటున్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ లోడింగ్ కారణంగా టైర్లు, యాక్సిల్లు, ఇతర విడిభాగాలు దెబ్బతిని భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, ట్రాక్టర్ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ధాన్యం లోడింగ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.?

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!