ధాన్యం తరలింపులో ఓవర్ లోడింగ్!

నిబంధనలు పట్టించుకొని అధికారులు  ఓవర్ లోడింగ్ నివారించాల్సిన అధికారులే ఓవర్ లోడ్ చేయిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది...?  వాహనాలు దెబ్బతింటాయని ట్రాక్టర్ యజమానుల ధర్నా. విశాలజ్యోతి డెస్క్ : ( హుస్నాబాద్ రూరల్ ) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులు మంగళవారం మండలంలోని బంజేరుపల్లి శివారు ప్రాంతంలోని ఓ రైస్ మిల్లు వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించే ప్రక్రియలో భాగంగా ఓవర్ లోడింగ్ చేయిస్తున్నారని...