ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeతెలంగాణభద్రాద్రిగబ్బుతో జబ్బు గ్యారంటీ..!

గబ్బుతో జబ్బు గ్యారంటీ..!

📰 Generate e-Paper Clip

• దుర్వాసనతో మరుగుదొడ్లు

• వాష్ రూమ్స్ సరిగ్గా లేక ఇబ్బందులు

• జల సమస్య తాకిడి..శాశ్వత పరిష్కారం అయ్యేనా?

• వైద్యశాల వార్డుల్లో కుక్కల సంచారం

పారిశుద్ధ్యన్ని మరింత మెరుగుపరచాలి

• సౌకర్యాలతో పాటుగా వైద్యులను నియమించాలి

భద్రాద్రి కొత్తగూడెం, విశాలజ్యోతి: 

ఈ పెద్ద ఆసుపత్రి మరుగుదొడ్లు చూస్తే.. కొత్త జబ్బు గ్యారెంటీగా వస్తుందని పలువురు సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించడం విమర్శలకు తావిస్తుంది. ఉన్న రోగాన్ని తగ్గించుకునేందుకు ఆసుపత్రికి వస్తే.. కొత్త రోగం అంటుకునే వాతావరణం కనిపిస్తుందని ప్రజలకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు ప్రభుత్వం వైద్య సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్న.. ఇక్కడ మాత్రం జిల్లా పెద్ద ఆసుపత్రికి సమస్యల తాకిడి ఎక్కువైంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్య విభాగంపై.. సరైన పర్యవేక్షణ లేని కారణంగానే మరుగుదొడ్లు అద్వానంగా కనిపించడంతోపాటుగా.. ఇతర సమస్యలతో పేషెంట్లు సందర్శకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ దవాఖాన సమస్యల వలయంగా మారింది. బయట నుంచి చూస్తే అందంగా కనిపిస్తున్నా లోపల మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో రోగులతోపాటు పేషెంట్లతో ఉండే వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ ధర్మాస్పత్రికి నీళ్ల కొరత తీవ్రంగా ఉంది. అయితే ఈ సమస్యను కేవలం తాత్కాలిక పరిష్కారం చూపే చర్యలు చేపట్టకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సందర్శకులు డిమాండ్ చేస్తున్నారు. నీటి వసతి సక్రమంగా లేక ఆసుపత్రిలో ఉండే మరుగుదొడ్లు గబ్బు కొడుతున్నాయి. నీటి కొరత కారణంగా అనేకమంది బయట నుండి నీళ్లను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లూజ్ వాటర్ తో లీటర్ కు ఐదు రూపాయలు వసూలు చేయడంతో ఆర్థిక భారం పడుతుంది. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో ఎక్కడ పడితే అక్కడ కుక్కలు సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ కుక్కలు ఆవరణలో అటు ఇటు తిరుగుతుండడం వల్ల వైద్య సిబ్బందికి సందర్శకులకు అసౌకర్యంగా మారింది. పెద్ద ఆస్పత్రిలో ప్రధాన సమస్యలను పాలకులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!