ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeతెలంగాణకృతజ్ఞత అనేది మా రక్తం, మా కుటుంబంలో ఉంది: కొండా

కృతజ్ఞత అనేది మా రక్తం, మా కుటుంబంలో ఉంది: కొండా

📰 Generate e-Paper Clip

• కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు.

• మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.

• పదవి అనేది కేవలం అలంకారం మాత్రమే.

• పదవి లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం.

• తూర్పు నియోజకవర్గం లో 24 మంది కార్పొరేటర్ లను గెలిపించుకుంటా

• మాజీ మంత్రి కొండా సురేఖ

వరంగల్, విశాలజ్యోతి: వరంగల్ లోని ఎం కె నాయుడు హోటల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ గారు,మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా మురళి గారు మాట్లాడుతూ కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని తెలిపారు. పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ కృతజ్ఞత అనేది మా రక్తం మా కుటుంబంలో ఉంది అని కొండా మురళి గారు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో 24 మంది కార్పొరేటర్లు గెలిపిస్తానని తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి టికెట్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. మమ్మల్ని నమ్ముకుని చాలామంది నాయకులు ఉన్నారని కొండా మురళి మాటంటే మాటేనని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతామని తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని కార్యకర్తలే కొండా దంపతుల బలమని కాంగ్రెస్ పార్టీలోనే కొండా దంపతులు కొనసాగుతారని మరోసారి కొండా మురళి స్పష్టం చేశారు. నా శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్స్ ఉన్నాయి.మీ ఆశీస్సులు నన్ను బత్రికిస్తున్నాయని తెలిపారు.”మాజీ మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీని విడిపోయేది ఏం లేదని విలువలకు కట్టుబడి కొండా దంపతులు రాజకీయాలు చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. గత పది రోజులుగా కొండా దంపతులను నమ్ముకున్న కార్యకర్తలు మనోవేదనకు గురైయ్యారనితెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన పదవికి ఎక్కడ మచ్చ తీసుకుని రాలేదని పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజాసేవలోనే ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. మంత్రి పదవి పోయినందుకు బాధ లేదని కానీ అకారణంగా తొలగించారనే వేదన మాత్రం ఉందన్నారు పదవి అనేది కేవలం ఒక అలంకారం మాత్రమే పదవి లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం మళ్లీ మంచి రోజులు వస్తాయని మాజీమంత్రి సురేఖ గారు తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో అవకాశవాదం ఎక్కువైందని ఉదయం ఒక పార్టీలో ఉండి సాయంత్రానికి మరో పార్టీలోకి మారే సంస్కృతి పెరిగిందని విమర్శించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆ తర్వాత కొంతమంది గుంట నక్కల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాలేక పోతే కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారు. నాడు అధికారంలో ఉన్న మంత్రిని ఓడించి గెలిచాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో నాకు మళ్ళీ మంత్రి బాధ్యతలు వచ్చాయని తెలిపారు. కొండా దంపతులు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేస్తారని కొండా దంపతుల మీద మాట్లాడే నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాజీ మంత్రి సురేఖ గారు తెలిపారు. పార్టీ అధిష్టానం నుండి ఫోన్స్ వస్తున్నాయని పార్టీని వీడమని అధిష్టానానికి చెప్పామని వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తామని సురేఖ గారు తెలిపారు. త్వరలోనే కొండా మురళి గారికి చైర్మన్ పదవి వరిస్తుందని వరంగల్ తూర్పు నియోజకవర్గం లో 24 మంది కార్పొరేటర్ లను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ గారు ఈ సందర్బంగా తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!