ePaper
Wednesday, June 3, 2026
spot_img
ePaper
Homeజాతీయంవివాహిత కుమార్తెకూ కారుణ్య నియామక అర్హత

వివాహిత కుమార్తెకూ కారుణ్య నియామక అర్హత

📰 Generate e-Paper Clip

ఆమె కూడా పుట్టింటి కుటుంబ సభ్యురాలే

• సుప్రీం కోర్టు సంచలన తీర్పు

విశాలజ్యోతి: కుటుంబ నిర్వచనం పరిధి నుంచి వివాహిత కుమార్తెను మినహాయించడం ఏకపక్షం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనంటూ జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 

తండ్రి మరణానంతరం అతని స్థానంలో చౌక ధరల దుకాణం లైసెన్స్‌ను తనకు కేటాయించాలన్న కుమార్తె అభ్యర్థనను ధర్మాసనం సమర్థించింది. ఆమెకు ప్రతికూలమైన తీర్పునిచ్చిన అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

కారుణ్య నియామకాలకు వివాహమై అత్తగారింటికి వెళ్లిన కుమార్తెను పుట్టింటి కుటుంబ సభ్యురాలుగా పరిగణించరాదన్న ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తర్వును రేషన్‌ షాపు డీలర్‌ కుమార్తె హైకోర్టులో సవాల్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించగా.. సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం …. 

వివాహమైనంత మాత్రాన కుమార్తెతో కుటుంబ బంధం ముగిసిపోదని, కొనసాగుతూనే ఉంటుందని ధర్మాసనం తెలిపింది. వివాహమైన కుమారుడు విడిగా దూరంగా ఉంటున్నప్పటికీ కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తూ.. కుమార్తె విషయంలో భిన్నంగా ఆలోచించడం లింగ వివక్షేనని ధర్మాసనం అభిప్రాయపడింది.”

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!