ePaper
Monday, June 1, 2026
spot_img
ePaper
Homeతెలంగాణమహబూబాబాద్బడికి భద్రతేది..?

బడికి భద్రతేది..?

📰 Generate e-Paper Clip

• పట్టణం నడిబొడ్డున ఉన్న పట్టించుకొనే నాధుడే లేడు.

•మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గ్రీన్ మ్యాట్ తో మేనేజ్ చేశారు. 

విశాలజ్యోతి: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ 2025 జూన్ 30న కురిసిన వర్షాలకు కొంతమేర కూలిపోయింది. జూన్ 12 నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండటం త్వరలో వర్షాకాలం రానున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల ప్రహరీ గోడ ఎప్పుడు కూలుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అటువంటి పరిస్థితి లేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రతినిధులు ఎవరూ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం బాధాకరం. 2026 ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలో పోలింగ్ బూత్ ఉండటంతో అధికారులు హడావుడిగా భారీకేడ్లు, కర్రల సాయంతో గ్రీన్ మ్యాట్ కట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేయడం గమనార్హం. వర్షాకాలం రానున్న నేపథ్యంలో శిధిలావస్థలో ఉన్న మిగతా కూడా ఎప్పుడు పులుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారి భద్రతకు భరోసా ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి శాశ్వతం పరిష్కారంగా నూతన ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!