- కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండిపై సుంకాలు డబుల్..
- బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచిన కేంద్రం
- ఏడాదిపాటు బంగారం కొనవద్దని ప్రధాని కోరిన కొద్దిరోజుల్లోనే ఈ నిర్ణయం
- దిగుమతులను తగ్గించి, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు
- పన్నుల పెంపుతో స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
విశాలజ్యోతి డెస్క్ : దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుంచి 15%కి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5% అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) రూపంలో ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి (95.75) పడిపోవడం, వాణిజ్య లోటు పెరగడంతో దిగుమతులను కట్టడి చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


