ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌స్యూస్..

ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌స్యూస్..

📰 Generate e-Paper Clip

కూటమి సర్కార్ సంచలన నిర్ణయం..

విశాలజ్యోతి డెస్క్: సమాజంలో దశాబ్దాలుగా వివక్ష, నిరాకరణ, ఉపాధి లేమి మరియు గుర్తింపు సమస్యలతో సతమతమవుతున్న ట్రాన్స్‌జెండర్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, వారి సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు’ను ఏర్పాటు చేస్తూ, దానికి ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎస్ నంబర్ 14ను విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, ‘రూల్స్-2020’ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ఈ బోర్డులో వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆంధ్రా ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్, రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులుగా కోటా ప్రేమ్ సాగర్ రాయ్ (తూర్పుగోదావరి), నక్క జీవన్ కుమారి (గుంటూరు), బోను దుర్గ (ప్రకాశం)లను సభ్యులుగా నియమించారు. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు లేదా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!