ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌స్యూస్..
కూటమి సర్కార్ సంచలన నిర్ణయం.. విశాలజ్యోతి డెస్క్: సమాజంలో దశాబ్దాలుగా వివక్ష, నిరాకరణ, ఉపాధి లేమి మరియు గుర్తింపు సమస్యలతో సతమతమవుతున్న ట్రాన్స్‌జెండర్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, వారి సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు’ను ఏర్పాటు చేస్తూ, దానికి ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎస్ నంబర్ 14ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, ‘రూల్స్-2020’ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర...