ePaper
Tuesday, June 2, 2026
spot_img
ePaper
Homeతెలంగాణఆయిల్ పామ్ సాగుతో బంగారు భవిష్యత్తు

ఆయిల్ పామ్ సాగుతో బంగారు భవిష్యత్తు

📰 Generate e-Paper Clip

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

వనపర్తి,విశాలజ్యోతి:  వనపర్తి జిల్లా కేంద్రం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఉద్యాన పంటల సాగు – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పంపుదల – ప్రత్యామ్నాయ పంటల సాగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ అత్యధిక వంటనూనె దిగుబడి నిచ్చే పంటలలో ఆయిల్ ఫామ్ ప్రధానమైనదని తెలిపారు. ఆయిల్ ఫామ్ ఎక్కువగా మలేషియా దేశంలో పండిస్తారని మలేషియా దేశం భూమధ్యరేఖకు దగ్గర ఉండడంతో ఆ దేశంలో వాతావరణం ఆయిల్ ఫామ్ కు అనుకూలంగా ఉండడంతో ఎక్కువగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. వంట నూనెను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం మలేషియా అని తెలిపారు.వంట నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారతదేశం అని తెలిపారు. భారతదేశంలో జనాభా అధికంగా పెరగడంతో ఆయిల్ కొరత ఎక్కువ అవుతుందని అందుకు మనం ఆయిల్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మన దేశం లోనే ఆయిల్ ఫామ్ సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇచ్చి మరి ఆయిల్ ఫామ్  సాగుకు సహకరిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు. రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాల కల్పన చేస్తూ,రైతును రాజును చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో రైతు కమిషన్ నెంబర్ భవాని రెడ్డి, రిటైర్డ్ వ్యవసాయ అధికారి కృపాకర్ రెడ్డి, వనపర్తి జిల్లా హార్టికల్చర్ అధికారి విజయభాస్కర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి శాస్త్రవేత్త,మోజర్ల ఆర్టికల్చర్ ప్రిన్సిపాల్ వీణ జోషి, కాంగ్రెస్ నాయకులు చెన్నయ్య, బాల్ రాజు,సిరివాటి సురేష్ , పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు,వనపర్తి జిల్లా రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img
error: Content is protected !!