ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeతెలంగాణకుట్రలు పన్ని, కక్ష కట్టి, మంత్రి పదవి నుండి తొలగించారు

కుట్రలు పన్ని, కక్ష కట్టి, మంత్రి పదవి నుండి తొలగించారు

📰 Generate e-Paper Clip

• నాపై కుట్రలు పన్ని, కక్ష కట్టి మంత్రి పదవి నుండి తొలగించారు 

•  అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం

•  ఒక్కమాట నాకు చెప్పలేదు.. నేరుగా భర్తరఫ్ చేసారు

•  బర్తరఫ్ అనంతరం మీడియా సమావేశంలో మాజీమంత్రి కొండా సురేఖ ఫైర్!

విశాలజ్యోతి డెస్క్: 

 

ఉరిశిక్ష అమలు చేసే సమయంలో కూడా ఉరివేస్తున్నాం అని చెప్తారు. చివరికొరిక ఏమైనా ఉందా అని అడుగుతారు. కానీ కావాలని కక్ష కట్టి కుట్ర చేసి తిరుపతి రెడ్డి తదితరులు నన్ను తీసేయించారు. సుమంత్ విషయంలో కూడా అంతా కుట్ర చేసారు. సుమంత్ పేరు చెప్పి నేరాలు సెటిల్మెంట్లు చేసి కావాలని బద్నాం చేశారు. సుమంత్ కేసును సీసీఎస్ కు బదిలీ చేసి టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను మంత్రిగా ఉండగా మా ప్రభుత్వంలో ఇంత జరుగుతోంది. ఎవరైతే నన్ను బర్తరఫ్ చేయించిన వారిలో మల్లు రవి ఉన్నాడు.. ఆయన తిట్టలేదా పార్టీని. మాజీ సీఎం రోశయ్య ఏకంగా విధవ రాజ్యం ఏలుతోందని ఇందిరాగాంధీని తిట్టాడు. యాబై కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొన్నాడు అని తిట్టిపోసిన వాళ్ళని ఎందుకు వదిలేశారు.

• ప్రజలనుండి రాజకీయాల్లో పైకి వచ్చాం… ప్రజలకే మేం జవాబుదారీ

•  కడియం శ్రీహరి కూడా నాగురించి మాట్లాడుతున్నాడు. నా కూతురు అంటే నన్ను తీసేస్తారా..? నాకు చెప్పాపెట్టకుండా నన్ను తీసేస్తారా..?

• నాకు జరిగిందే మీకు జరుగుతుంది..!

• ఇబ్బంది పడుతున్న నేతలారా.. బయటకు రండి.. గళం విప్పండి..!

• ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై నోరు విప్పండి… లేదంటే నష్టం తప్పదు..!

•  నా పదవి తీసేయడం వేరు.. నాకు ముందే చెప్పాల్సింది..!

•  బీసీ రిజర్వేషన్లు మేము చేశాం అంటున్న సీఎం రేవంత్ ఒక బీసీ మహిళ మంత్రి పదవి ఎలా తీసేసారో చెప్పాలి..!

•  ప్రభుత్వం సర్దుకోవాలి.. మార్చుకోవాలి.. మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలు రాబోతున్నాయి..!

•  మోనోపోలీ వ్యవహారం తప్పు! నేను పదేళ్లు సీఎం అని ఆయనకు ఆయన చెప్పుకోవడం తప్పు..! ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం తప్పు..!

అనంతరం మీడియా సమావేశంలో లేఖ విడుదల చేస్తూ, అందులో అన్ని అంశాలు పేర్కొన్నట్లుగా చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!