సర్వ రోగ నివారిణి ఈ చెట్టు

Share

ఆకు ఒక్కటే కాదు.. మునగ చెట్టు బెరడు నుంచి మునగ కాడలు, వాటిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే.. అదో ఔషధాల నిధి. పోషకవిలువల గని.

ఇంగ్లిష్‌ లో మోరింగా

మునగను ఇంగ్లిషులో మోరింగా అని అంటారు.
ఇది మురుంగై అనే తమిళ పదం నుంచి వచ్చింది.

మునగ.. పాశ్చాత్యలకు ఇది మేజికల్‌ ట్రీ. మన దగ్గర.. ‘అమ్మకు ప్రియనేస్తం’. ఎన్నో పోషక పదార్థాలు ఉండే మునగను ఏడాదికొక్కసారైనా.. కనీసం ఆషాఢంలో నైనా తినాలన్నారు పెద్దలు! ఒక్క ఆషాఢం అనే ఏంటి.. తరచూ తినాల్సిన ఆకు అని ఆధునిక వైద్యనిపుణులు అంటున్నారు. అల్లోపతి, ఆయుర్వేదాలు రెండింటిలోనూ మునగకు విశిష్ట స్థానం ఉంది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. బాక్టీరియాపై ప్రభావశీలమైన యుద్ధం చేస్తుంది కాబట్టి ఎన్నో వ్యాధులకు శారీరక సమస్యలకు ఓ అత్యుత్తమ పరిష్కారంగా డాక్టర్లు చెబుతున్నారు.

మునగ విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి..
ఇవి వాపుల్ని, ఒత్తిడిని నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది. కణాల డ్యామేజి జరక్కుండా చూస్తాయి..

యాంటాసిడ్‌గా మునగాకు గ్యాస్ట్రిక్‌ అల్సర్లను నయం చేస్తుంది. ఊబకాయం, మధుమేహానికి మంచి మందు. కేన్సర్‌ చికిత్సలోనూ దీని పాత్రను ఇపుడిపుడే అంచనా వేస్తున్నారు. కండరాల నొప్పి, క్షీణతకు తగిన మందు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల నిద్ర సరిగా పట్టేట్టు చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి, లివర్‌ సిరోసి్‌సకు ఇది అద్భుతమైన మందు అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. 200 మిల్లీ గ్రాముల మునగాకు పొడి తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ దాదాపు 40కు తగ్గుతాయి. లైంగిక సామర్థ్యం పెరగడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది, తినడానికి ఘాటుగా ఉన్నా ఇది పరమౌషధం.

  • రూ.80 కిలో మునగాకు ఎగుమతి ధర
  • రూ.500 కిలో మునగవిత్తనాల ఎగుమతి ధర.

ఇవీ పోషకాలు..

వంద గ్రాముల మునగాకులో
ఏమేం పోషకాలుంటాయంటే..
మాంసకృత్తులు: 8.3 గ్రాములు
కాల్షియం: 434 మిల్లీగ్రాములు
పొటాషియం: 202 మిల్లీగ్రాములు
విటమిన్‌ ఎ: 738 మిల్లీగ్రాములు
విటమిన్‌ సి: 164 మిల్లీ గ్రాములు
పీచుపదార్థాలు: 19.2 గ్రాములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *