ePaper
Friday, September 25, 2026
ePaper
Homeతెలంగాణబీసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలి

బీసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలి

📰 Generate e-Paper Clip

• మహబూబాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు చెన్నూరి విజయలక్ష్మి.

హైదరాబాద్, విశాలజ్యోతి: తెలంగాణ రాష్ట్రం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం కులకచర్ల శ్రీనివాస్ గారి అధ్యక్షతన హైదరాబాద్ ఖైరతాబాద్ తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాజుల శ్రీనివాస్ గౌడ్, బైరి రవికృష్ణ , రాష్ట్ర మేధావుల సంఘం, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలు బలమైన రాజకీయ శక్తి గా రూపాంతరం చెంది, రాబోవు రోజుల్లో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని వక్తలు అన్నారు. జనాభాలో మనమెంతో మనకంత అనే నినాదంతో ముందుకెళ్లాలని, అన్ని రంగాల్లో బీసీలు ముందుండాలని, మన వాటా మనకి దక్కే వరకు పోరాటం చేయాలని అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు బీసీలను రాజకీయ ఓటు బ్యాంకు లాగా వాడుకుంటున్నారని, బిసిలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీసీలదే రాజ్యాధికారం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు చెన్నూరి విజయలక్ష్మి, పొన్నవైన మాధవి, మండ రేణుక సురేష్, భోజన పల్లి గోవిందమ్మ, యువత తదితరులు పాల్గొన్నారు

.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!