ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeతెలంగాణమహబూబాబాద్వాకర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తా

వాకర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తా

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్ జిల్లా, విశాలజ్యోతి: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని యతిరాజారావు పార్క్ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్’ వారి విజ్ఞప్తి మేరకు, 7వ వార్డు కౌన్సిలర్ మాడుగుల భవాని లత గారు ఈరోజు ఉదయం 10వ వార్డు కౌన్సిలర్ ముద్ధసాని సురేష్ గారితో కలిసి యతిరాజారావు పార్క్‌ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్కులోని ఓపెన్ జిమ్ మరమ్మతులు మరియు కొత్త పరికరాల ఏర్పాటు గురించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కౌన్సిలర్ గారు వివరంగా చర్చించారు. వాకర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న వారు, జిమ్ రిపేర్లు త్వరితగతిన పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ మరమ్మతుల కొరకు మున్సిపాలిటీలో ఇప్పటికే తీర్మానం కూడా మంజూరైన విషయాన్ని వారితో తెలియజేశారు. తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి పరిష్కారం చూపినందుకు యతిరాజారావు పార్క్ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు కౌన్సిలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవాని లత, ముద్ధసాని సురేష్ గారితో పాటు అసోసియేషన్ అధ్యక్షులు కత్తి రవీందర్, మాదాసు రాములు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెరుమాండ్ల రవి గౌడ్ , జాయింట్ సెక్రటరీ మంగమ్మ, ఎంఈఓ బుచ్చయ్య, చీకటి వెంకన్న, రాయి శెట్టి వెంకన్న, భాస్కర్ రెడ్డి, యాకుబ్ అలీ మరియు ఇతర వాకర్స్ పాల్గొనడం జరిగింది.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!