అట్లాంటిక్ తీరంలో ‘హంటా’ కలకలం.. భారత్ అప్రమత్తం!
విశాలజ్యోతి వెబ్ డెస్క్: హైదరాబాద్, మే 08 దక్షిణ అట్లాంటిక్ తీరంలో ప్రయాణిస్తున్న ఎంపీ హోండియస్ యాత్ర నౌక (ఫైల్ ఫోటో) ప్రపంచం మరో ఆరోగ్య సంక్షోభం అంచున నిలబడింది. 2026 ఏప్రిల్ మాసంలో ఎంపీ హోండియస్ (MV Hondius) అనే డచ్ విహార నౌకలో తలెత్తిన హంటా వైరస్ వ్యాప్తి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంటార్కిటికా యాత్రకు వెళ్లిన 149 మంది ప్రయాణికులలో ఈ వైరస్ ప్రాణాలు తీయడం, అది ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందనే వార్తలు ప్రజారోగ్య నిపుణులను ఆందోళనకు...