VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 5:38 am Posted by : DK MEDIA

‘కాళేశ్వరం’ పై బిగ్ అప్డేట్!

తెలంగాణ లోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నిన్న తుది నివేదికను ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే. దీనిపై CM రేవంత్రెడ్డి నేతృత్వంలో ఇవాళ కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, CS రామకృష్ణారావు, ముఖ్య కార్య దర్శి రాహుల్ బొజ్జా CMకు నివేదిక అందిస్తారని సమాచారం. దీనిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి