VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 6:11 am Posted by : DK MEDIA

సుప్రీం కోర్టు కీలక తీర్పు

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు వచ్చిన మూడు నెలల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.