VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 12:42 pm Posted by : DK MEDIA

స్టీల్ ప్లాంట్లో గ్యాస్ లీక్..

  • నలుగురు కార్మికులకు అస్వస్థత!

విశాలజ్యోతి డెస్క్ :    విశాఖ ఉక్కు కర్మాగారంలోని థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ కావడంతో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో నమ్మి శ్రీనివాసరావుకు కాలు విరగగా, పెదగంట్యాడ ప్రాంతంకి చెందిన తాతారావు, అప్పన్న రెడ్డి, ఎండీ అజీజ్లను చికిత్స నిమిత్తం గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, యాజమాన్యం సమక్షంలో దర్యాప్తు ప్రారంభించారు.