సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

విశాలజ్యోతి డెస్క్: సీఎం సహాయనిధి పేదలకు ఓ వరం లాంటిదని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.6 లక్షల 33 వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని...