వివాహిత కుమార్తెకూ కారుణ్య నియామక అర్హత
• ఆమె కూడా పుట్టింటి కుటుంబ సభ్యురాలే • సుప్రీం కోర్టు సంచలన తీర్పు విశాలజ్యోతి: కుటుంబ నిర్వచనం పరిధి నుంచి వివాహిత కుమార్తెను మినహాయించడం ఏకపక్షం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనంటూ జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధే ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తండ్రి మరణానంతరం అతని స్థానంలో చౌక ధరల దుకాణం లైసెన్స్‌ను తనకు కేటాయించాలన్న కుమార్తె అభ్యర్థనను ధర్మాసనం సమర్థించింది. ఆమెకు ప్రతికూలమైన తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని...