VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 3:46 pm Posted by : DK MEDIA

రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యంపై ప్రజల ఆగ్రహం

• అధికార పార్టీ పట్టించుకోవట్లేదు.

• ప్రతిపక్ష పార్టీకి కనపడట్లేదు.

• నిత్యం ప్రజలు అష్టకష్టాలు పడుతున్న కనుకరిస్తలేరు.

విశాలజ్యోతి డెస్క్ : 

 

కరీంనగర్ నగరంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ పోరాటానికి వేదికగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనులు రాజకీయ వివాదాల కారణంగా ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడుేళ్లు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వ్యాపారులు సుమారు 50 శాతం వరకు నష్టపోతున్నారని చెబుతున్నారు. ప్రతిరోజూ వేలాది వాహనదారులు ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతుండగా, అత్యవసర సేవలకు కూడా ఆటంకం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.