భారీగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
• 22.6 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం. • రూ.1.12 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం సీజ్.. • బొలేరో వాహనం స్వాధీనం. • డ్రైవర్‌తో పాటు నలుగురిపై కేసు నమోదు. నందిపేట్, విశాలజ్యోతి : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) రేషన్ బియ్యాన్ని పోలీసులు, సివిల్ సప్లయ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22.60 క్వింటాళ్ల బియ్యాన్ని, దాని విలువ సుమారు రూ.1,12,548గా అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారంలో నలుగురిపై...