బీసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలి
• మహబూబాబాద్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు చెన్నూరి విజయలక్ష్మి. హైదరాబాద్, విశాలజ్యోతి: తెలంగాణ రాష్ట్రం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం కులకచర్ల శ్రీనివాస్ గారి అధ్యక్షతన హైదరాబాద్ ఖైరతాబాద్ తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాజుల శ్రీనివాస్ గౌడ్, బైరి రవికృష్ణ , రాష్ట్ర మేధావుల సంఘం, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలు బలమైన రాజకీయ శక్తి గా రూపాంతరం చెంది, రాబోవు రోజుల్లో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని...