విశాలజ్యోతి డెస్క్: MV హోండియస్ క్రూయిజ్ షిప్లో ‘ఆండెస్ హంటావైరస్’ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా నెదర్లాండ్స్, జర్మనీలలో ముగ్గురు మరణించగా, పలు దేశాల్లో కేసులు నమోదయ్యాయి. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్లకు వ్యాపించిన ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నాయి.బాధితులకు ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు.అర్జెంటీనా నుండి బయలుదేరిన ఈ నౌకలో తలెత్తిన ఈ అరుదైన వైరస్ వ్యాప్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆందోళనకు దారితీసింది.