నకిలీ కులపత్రం… టీచర్ పై వేటు
• సర్టిఫికెట్లు రద్దు చేసిన మెదక్ జిల్లా కలెక్టర్! విశాలజ్యోతి డెస్క్: తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఓ లేడీ టీచర్ గుట్టురట్టయింది. నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్, నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగం పొందినట్లు తేలడంతో.. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే..? 2024 డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌లో బీసీ-ఈ (BC-E) కేటగిరీ కింద 5 ఎస్జీటీ (SGT) పోస్టులను కేటాయించారు. టేక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి...