కేయూ ను పట్టించుకునే నాధుడేలేడు.
• కామన్ మెస్‌లో పట్టపగలే కిరాణా సరకుల తరలింపు..? • వీడియో వైరల్.. కేయూలో మరో వివాదం .. • అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం విశాలజ్యోతి: కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్‌లో మరో వివాదాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. కామన్ మెస్ స్టోర్‌రూమ్ నుంచి కిరాణా సరకులు బయటకు తీసుకువచ్చి ద్విచక్ర వాహనంపై తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతూ క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. వేసవి సెలవుల అనంతరం...