VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 8:22 pm Posted by : DK MEDIA

కలెక్టర్ తో ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

విశాలజ్యోతి డెస్క్: ఇటీవల మహబూబాబాద్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ను తొర్రురు, పెద్దవంగర మండలాల ప్రజాప్రతినిధులతో కలిసి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల నిర్వహణను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ గారు రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.